మన బిడ్డ మరో రికార్డు - akonkagwa
దేశ విదేశాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలపై జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు పూర్ణ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఉత్తర అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా ఖండాల్లోని పర్వతాలను అధిరోహించడమే తన లక్ష్యమంటోంది తెలంగాణ గిరిజన ఆణిముత్యం.

కామారెడ్డి జిల్లా ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థి మాలావత్ పూర్ణ మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ అకోంకాగ్వా(6962మీ)ను అధిరోహించి సత్తా చాటింది. నాలుగు ఖండాల్లో అత్యంత ఎతైన పర్వతాలు ఎక్కిన అతిచిన్న గిరిజన మహిళగా పూర్ణ చరిత్ర సృష్టించింది. ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలు అధిరోహించడమే తన లక్ష్యమని.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సహకారానికి పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమెను అభినందిచారు.
ఈమెతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు కూడా అకోంకాగ్వా పర్వతాన్ని అధిరోహించాడు.