కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను జిల్లా పాలనాధికారి శరత్ కుమార్ పరిశీలించారు. పనికి వచ్చే కూలీలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భౌతికదూరం పాటించాలని, మాస్క్లు ఖచ్చితంగా ధరించాలని సూచించారు.
'కూలీలు విధిగా మాస్కులు ధరించాలి' - employment guarantee works in Ellareddy village
ఉపాధి హామీ పథకం పనులు చేసే కూలీలు కరోనా వైరస్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ కోరారు. పనికి వచ్చే కూలీలు భౌతికదూరం పాటించాలని... అలాగే మాస్కులు ధరించాలని సూచించారు.

కూలీలు విధిగా మాస్కులు ధరించాలి
దీని ద్వారా కరోనా వైరస్ మాత్రమే కాకుండా పని చేస్తున్నప్పుడు వచ్చే దుమ్ము, ధూళి నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చునని తెలిపారు. అంతేగాక ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.