తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు పడక గదుల ఇళ్లకు పోచారం భూమిపూజ - foundation stoned by speaker pocharam srinivasreddy

బాన్సువాడలోని ఎస్సీ కాలనీలో రెండు పడక గదుల ఇళ్లకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. పేదవారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

రెండు పడక గదుల ఇళ్లకు పోచారం భూమిపూజ

By

Published : Nov 11, 2019, 11:02 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించనున్న 76 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. తెరాస ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి పేదవారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఇళ్ల నిర్మాణ చేపడుతోందని అన్నారు. అన్ని వసతులతో కూడిన ఇంటిని పట్టణాల్లో రూ. 5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5.04 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ సుదర్శన్, మునిసిపల్ కమిషనర్ కుమారస్వామి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రెండు పడక గదుల ఇళ్లకు పోచారం భూమిపూజ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details