తెలంగాణ

telangana

ETV Bharat / state

భిక్కనూరులో నిత్యావసరాల పంపిణీ - కామారెడ్డి పేదలు నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో నిత్యావసరాలను పంచారు. పీఆర్​టీయూ ఆధ్వర్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ నిత్యావసరాలను పంపిణీ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్​ అలీ సైతం ఆటో డ్రైవర్లకు సరుకులు అందజేశారు.

భిక్కనూరులో నిత్యావసరాలు పంపిణీ
భిక్కనూరులో నిత్యావసరాలు పంపిణీ

By

Published : May 5, 2020, 2:07 PM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కేంద్రంలో లాక్​డౌన్​తో అవస్థలు పడుతున్న వారికి పీఆర్​టీయూ, కాంగ్రెస్ నేత షబ్బీర్​ అలీల​ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిత్యావసరాలను పంపిణీ చేశారు.

పేదలకు నిత్యావసరాలు పంచిన గంప గోవర్ధన్...

పీఆర్​టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ పాల్గొన్నారు. సుమారు 230 మందికి నెలకు సరిపడా సరుకులను ఎమ్మెల్యే అందజేశారు.​ కనిపించని శత్రువుతో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వారిని ఆదుకునేందుకు 16 గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు, ఆశ కార్యకర్తలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామన్నారు.

ఆటో డ్రైవర్లకు సరుకులు అందజేసిన షబ్బీర్​ అలీ...

మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం 50 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలను అందజేశారు. వలస కూలీలు ఇళ్లు చేరేలా వాహనాలు ఏర్పాటు చేయాలని షబ్బీర్​ అలీ ప్రభుత్వానికి సూచించారు. వాళ్లకు రైలు సదుపాయాలు కల్పించాలని కోరారు. వారి ప్రయాణ ఖర్చులు సర్కారే భరించాలని... లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆ ఖర్చులు భరిస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి:కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details