కామారెడ్డి జిల్లా హమ్మాజీపేట, చత్రు నాయక్ తండాలో గిరిజనులు సాగు చేస్తోన్న పొలాన్ని అటవీ అధికారులు ధ్వంసం చేసిన పంటలను గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఉషన్ నాయక్ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులపై చేసిన దాడి చాలా అవమానకరంగా ఉందని ఆయన తెలిపారు. గిరిజనులపై దాడి చేయడమే బంగారు తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందా అని ప్రశ్నించారు.
'గిరిజనులపై దాడే... ప్రభుత్వ లక్ష్యం' - kamareddy district news
కేసీఆర్ సర్కారు... గిరిజనులపై దాడే లక్ష్యంగా పెట్టుకొందని ఆరోపించారు గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు ఉషన్ నాయక్. కామారెడ్డి జిల్లా హమ్మాజీపేట, చత్రు నాయక్ తండాలో ధ్వంసమైన గిరిజనుల పంటను ఆయన పరిశీలించారు.

'గిరిజనులపై దాడే... ప్రభుత్వ లక్ష్యం'
గిరిజనులపై దాడి చేసి పంటలను నాశనం చేయడం దురదృష్టకరమైన చర్య అని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనలకు నాయ్యం చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.