తెలంగాణ

telangana

By

Published : Sep 27, 2020, 10:33 AM IST

ETV Bharat / state

వర్షానికి నాలుగోసారి కొట్టుకుపోయిన రోడ్డు

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల- రాయచూర్ నందిన్నె వద్ద నిర్మించిన తాత్కాలిక రహదారి వర్షాల ధాటికి కొట్టుకుపోయింది. ఇదివరకే ఈ రోడ్డు మూడు సార్లు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

వర్షానికి నాలుగోసారి కొట్టుకుపోయిన రోడ్డు
వర్షానికి నాలుగోసారి కొట్టుకుపోయిన రోడ్డు

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు గద్వాల- రాయచూరు రహదారి నందిన్నె వద్ద తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు కొట్టుకుపోగా... రాకపోకలు స్తంభించాయి. ఇదివరకే మూడు సార్లు రోడ్డు వేసిన అధికారులు... తాజాగా కురిసిన వర్షానికి నాలుగో సారి కూడా రోడ్డు కొట్టుకుపోయింది.

కేటిదొడ్డి మండలం నందిన్నెలో పాత ఇల్లు కూలిపోయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కవిత... ఎన్నిక లాంఛనమే!

ABOUT THE AUTHOR

...view details