సహచర ఎమ్మెల్యేతో, మంత్రితో తమకు ఎలాంటి విభేదాలు లేవని గద్వాల్, అలంపూర్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా తెరాస కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు, మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో తమకు టికెట్లు కేటాయించి తమపై గురుతర బాధ్యత పెట్టారని తెలిపారు.
మా మధ్య విభేదాలు లేవు: తెరాస ఎమ్మెల్యేల ప్రకటన
తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధిపైనే తాము దృష్టిసారించామన్నారు.
'మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు'