జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్ శశాంక, శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పర్యటించారు. పారిశుద్ధ్యం, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు. వర్షం వస్తే కాలువల్లోని మురికి నీరంతా రోడ్లపైకి చేరుతోందని, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు విన్న కలెక్టర్, ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వార్డుల్లో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి - jogulamba gadwala
కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. స్థానికంగా పారిశుద్ధ్యం, తాగునీరు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. త్వరలోనే పారిశుద్ధ్యం మెరుగుపరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

వార్డుల్లో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
వార్డుల్లో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
ఇవీ చూడండి: ఎమ్మార్వో లావణ్యకు 14 రోజుల రిమాండ్