గద్వాలలోని ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హెపటైటిస్ చికిత్సా కేంద్రం, చిన్న పిల్లల వార్డును ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, వీఎం అబ్రహం, కలెక్టర్ శ్రుతి ఓఝాతో కలిసి జడ్పీ ఛైర్పర్సన్ సరిత ప్రారంభించారు. గద్వాల ఆసుపత్రిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా.. స్థాయి పెంచిన తర్వాత ఒక్కొక్కటిగా ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తున్నామని సరిత తెలిపారు.
'ప్రజల్లో నమ్మకం కలిగేలా సేవలందించాలి' - hepatitis center in gadwal hospital
పేదలు.. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా.. మెరుగైన చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలోనే పొందవచ్చని జోగులాంబ గద్వాల కలెక్టర్ శ్రుతి ఓఝా అన్నారు. జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పేదలందరూ ప్రైవేటు ఆసుపత్రికి పోయి ఆర్థికంగా నష్టపోకుండా.. మెరుగైన వైద్యసేవలందించే ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలని కలెక్టర్ శ్రుతి ఓఝా అన్నారు. ప్రజల్లో ప్రభుత్వాసుపత్రిపై నమ్మకం కలిగించేలా వైద్యులు, సిబ్బంది సేవలందించాలని సూచించారు.
కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడే రోగులు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స కేంద్రం లేకపోవటం వల్ల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారని, అలాంటి వారికి హెపటైటిస్ చికిత్స కేంద్రం వరం లాంటిదని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి వ్యక్తికి ముందుగానే థర్మల్ స్కానింగ్ నిర్వహించాలని సిబ్బందికి తెలిపారు. ప్రభుత్వాసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం కోరారు.
- ఇదీ చదవండి:ఐదు రోజులు... ఆరు హత్యలు...