తెలంగాణ

telangana

ETV Bharat / state

'సారూ.. మీ కాళ్లు మొక్కుతా.. నా భూమి నాకు ఇప్పించండి' - farmer fell down on mro feet for his place registration in maldhakal

తనకున్న రెండెకరాల భూమి.. వేరే వ్యక్తి పేరు మీదికి వెళ్లిపోయింది. ఇదే విషయమై కలెక్టర్​, రెవెన్యూ అధికారుల చుట్టూ దాదాపు ఏడాదిగా కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. అయినా ఫలితం లేదు. కొన్ని రోజులకు ఏకంగా వెబ్​సైట్​ నుంచే తొలగించారని తెలిసి.. చివరికి ఎమ్మార్వో కాళ్ల మీద పడి దీనంగా వేడుకున్నాడు.

'సార్​.. మీ కాళ్లు మొక్కుతా.. నా భూమి నాకు ఇప్పించండి'్
'సార్​.. మీ కాళ్లు మొక్కుతా.. నా భూమి నాకు ఇప్పించండి'

By

Published : Jul 28, 2021, 12:34 PM IST

'సారూ.. మీ కాళ్లు మొక్కుతా.. నా భూమి నాకు ఇప్పించండి'

భూఅక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఇంకెన్ని చర్యలు తీసుకున్నా... ఫలితాలు మాత్రం సామాన్యులకు ఇప్పటికీ అందటం లేదు. రైతులకు చెందిన భూవివాదాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం దిశగా అడుగులు పడకపోవటం వల్ల... తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.

11 నెలలుగా పోరాటం...

జోగులంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తప్పెట్ల మొరుసు గ్రామానికి చెందిన నర్సాగౌడ్​కు రెండున్నర ఎకరాలు పట్టా భూమి ఉంది. ఆ స్థలం కాస్తా.. ఆయనకు తెలియకుండానే వేరే వ్యక్తి పేరు మీదికి మారింది. విషయం తెలిసి వెంటనే.. రెవెన్యూ అధికారుల దృష్టికి నర్సాగౌడ్​ తీసుకెళ్లారు. అప్పటి నుంచి 11 నెలల పాటు రెవెన్యూ కార్యాలయం చుట్టు తిరుగుతూనే ఉన్నాడు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్ల నర్సాగౌడ్​ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మల్దకల్ ఎమ్మార్వో కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. 11 నెలలుగా మల్దకల్ తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్​కు పలుసార్లు వినతి పత్రం సమర్పించినా... సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

కాళ్లపై పడి వేడుకున్న రైతు..

కొన్ని రోజులకు... తప్పెట్ల మొరుసు గ్రామానికి చెందిన పలువురు రైతుల సర్వే నంబర్లను ధరణి వెబ్​సైట్​ నుంచి తొలగించారని తెలియగానే.. బాధితులంతా తహసీల్దార్​ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు ఏడాది నుంచి తిరిగినా పట్టించుకోకపోవటం.. ఏకంగా వెబ్​సైట్​ నుంచి తొలగించటం వల్ల ఆశలన్నీ కోల్పోయిన నర్సాగౌడ్​... చివరికి ఎమ్మార్వో కాళ్లపై పడ్డాడు. "మీ కాళ్లు మొక్కుతా సారు.. దయుంచి.. నా భూమి నాకు ఇప్పించండి. మీకు పుణ్యముంటది" అంటూ వేడుకున్నాడు.

స్పందించిన ఎమ్మార్వో.. సమస్య పరిష్కరిస్తానని నర్సాగౌడ్​కు హామీ ఇచ్చారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనాస్థలికి చేరుకుని.. వారం రోజుల్లో పరిష్కారం ఇప్పిస్తామని హామీ ఇవ్వటంతో మిగతా రైతులు కూడా ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details