Kodandaram Reaction on Medigadda Barrage Issue :భారతదేశంలో జరిగిన స్కామ్‌లలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు శ్వేతపత్రం విడుదల చేయకపోవడమే దీనికి నిదర్శనమని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ గురించి నిపుణుల కమిటీలు చెప్పిన విషయాలు తప్పని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం.. అసలు జరిగిన విషయం చెప్పక పోవడమే చోద్యంగా ఉందన్నారు.
Kodandaram Visits Medigadda Barrage In Jayashankar Bhupalpally : చిత్తశుద్ధి ఉంటే వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించినపుడు.. 7వ బ్లాక్‌లో 20 పియర్, బ్రిడ్జ్ కుంగిపోయి గేట్ వంగి పోయి కనబడినట్లు తెలిపారు. బ్లాక్ మొత్తం 10 మీటర్ల లోతు నుంచి బేస్ ఏర్పాటు చేసి పియర్లు నిర్మించారని, దానివల్ల మొత్తం బ్లాక్ కొత్తగా నిర్మాణం చేపట్టవలసి వస్తుందని చెప్పారు.
Kodandaram Comments On Medigadda Barrage Damage : కేంద్ర ప్రభుత్వ నిపుణులు ఏమీ చూడకుండానే నష్టం వాటిల్లిందని చెప్పారని బ్రిడ్జ్‌కు ఉన్న రెండు పలకల మధ్య ఏర్పడిన ఖాళీ స్థలం నుంచి చూస్తే ఏం తెలుస్తుందని అధికారులు అనండం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కట్టిన ప్రాజెక్టులు, డ్యామ్‌లు పటిష్ఠంగా ఉన్నాయని.. కానీ నాలుగేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసిన కారకులు ఎవరో గుర్తించి శిక్షించాలని.. నిపుణులతో కూడిన జ్యూడీషియరి కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.