జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులు,వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటపొలాలు నీటమునిగాయి. చెరువులు అలుగులు పోయడం వల్ల మత్స్యకారులు, గ్రామస్థులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 446.4మి.మీ వర్షపాతం నమోదైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - heavy rains in jayashankar bhupalpally district
జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల పంటలు నీటమునిగాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
జిల్లాలోని 11 మండలాలకు గానూ భూపాలపల్లి 48.6మి.మీ, చిట్యాల 60.2మి.మీ, ఘనపూర్ 44మి.మీ, రేగొండ 72మి.మీ, మొగుళ్లపల్లి 51.2మి.మీ, మహాదేవపూర్ 48.2మి.మీ,కటారం 70.2మి.మీ, మలహార్ 29.2మి.మీ, మహముత్తారం 42.8మి.మీ, మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఎడతెరుపు లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు, పొంగిపొర్లుతున్నాయి. ఘనపూర్ మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు అలుగు పారుతోంది.
ఇవీ చూడండి:సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం