తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2020, 10:42 AM IST

ETV Bharat / state

'గంట వ్యవధిలో లక్ష మొక్కలు.. హరిత జయ-2020 లక్ష్యం'

మెఘా అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గంట వ్యవధిలో లక్షమొక్కలు నాటడమే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి టెలీకాన్ఫరెన్స్​ ద్వారా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

collector mahammud abul ajeem teleconference on mega avenue plantation program in jayashankar bhupalapally
'గంట వ్యవధిలో లక్ష మొక్కలు.. హరిత జయ-2020 లక్ష్యం'

జయశంకర్​ భూపాలపల్లిలో జిల్లాలో చెపట్టనున్న మెఘా అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ సూచించారు.

గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ, అటవీ, మున్సిపల్ శాఖల అధికారులు, ఎంపీడీవోలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితజయ-2020 కార్యక్రమం ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో జిల్లాలో గల రహదారుల వెంట ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఒక గంట సమయంలో ఒక లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రధాన రహదారులతోపాటు గ్రామ రహదారులు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల మొత్తం 252 కోలోమీటర్ల పొడవునా రహదారుల వెంబడి మొక్కలు నాటుటకు గుంతలు తీశామని తెలిపారు. దీనికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి:ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details