* జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంటుందని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టింపు కరవైందని ఫిర్యాదుల పెట్టెలో దరఖాస్తు సమర్పించింది. నెల గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
* జనగామ జిల్లా కేంద్రానికి చెందిన సామాజికవేత్త పట్టణంలోని రోడ్ల దుస్థితిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కొన్ని రోజుల క్రితం కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల పెట్టెలో దరఖాస్తు సమర్పించాడు. నాటి నుంచి నేటి వరకూ రోడ్లన్నీ యథాస్థితిలో ఉన్నాయని ఎన్ని సార్లు విన్నవించినా రోడ్లకు మోక్షం కలగడంలేదని వాపోతున్నాడు.
పరిష్కారం అంతంతే..!
కరోనా కాలంలోనూ నా రక్షణ మరిచి మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఎంతో పరితపిస్తున్నాను. మీరు నాకిచ్చిన దరఖాస్తులను ఒకరోజు తర్వాత చూసి వాటిని సంబంధిత అధికారులకు పంపుతున్నారు. కొన్ని మండలాల్లో అయితే వారం రోజుల తర్వాత దరఖాస్తులను తెరిచి పరిశీలన చేపడుతున్నామని అంటున్నారు. ఫిర్యాదులు అధికంగానే వస్తున్నా పరిష్కారం తక్కువ అవుతున్నాయని దిగులుగానే ఉంది. పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో మా ఉన్నతాధికారులు విఫలమవుతున్నారని భావించే ఉండొచ్ఛు కానీ నేను స్వీకరించిన దరఖాస్తుల్లో తక్షణ పరిష్కారం అయ్యేవి ఒకటి, రెండు మాత్రమేనని మిగతావి ప్రభుత్వ ఆధీనంలోనివేనంటూ నా పై అధికారులు చెబుతున్నారు. చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని, కరోనాతో సిబ్బంది హోంక్వారంటైన్‌లో ఉండడం వల్ల సిబ్బంది కొరతతో దరఖాస్తుల పరిశీలన జఠిలం అవుతుందని అధికారులు అంటున్నారు.