జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులు, వారి కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ పట్ల ఎవరూ ఆందోళన చెందొద్దని.. సమష్టిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం తప్పక పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని కోరారు.
కరోనా బాధితులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ-కాన్ఫరెన్స్
కరోనా బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. సమష్టిగా వైరస్ను ఎదుర్కొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాలకుర్తి నియోజకవర్గంలోని కొవిడ్ బాధితులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించారు.
errabelli
టెలీ కాన్ఫరెన్స్లో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన డీఎంహెచ్వోలు, డీపీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పోలీసు అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్డౌన్' అస్త్రం