రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను జనగామ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటుకు అన్ని వసతులున్నాయని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. జనవరి 11న స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల గోడ పత్రికను ఆవిష్కరించారు.
'రాష్ట్ర స్థాయి కబడ్డీకి జనగామ మినీ స్టేడియం ఓకే' - 'రాష్ట్ర స్థాయి కబడ్డీకి జనగామ మినీ స్టేడియం ఓకే'
జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియాన్ని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పరిశీలించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న కబడ్డీ పోటీలకు జనగామ మినీ స్టేడియంలో అన్ని వసతులున్నాయని వెల్లడించారు.

జనగామ మినీ స్టేడియంలోనే కబడ్డీ పోటీలు
రాష్ట్ర కబడ్డీ పోటీలను నిర్వహించడానికి మినీ స్టేడియాన్ని పరిశీలించిన జగదీశ్... జనగామలో కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. పోటీలకు సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. క్రీడాకారులకు ఆధునిక సదుపాయాలు, వసతులు కల్పించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
జనగామ మినీ స్టేడియంలోనే కబడ్డీ పోటీలు
ఇవీ చూడండి : ఔట్సోర్సింగ్ సిబ్బంది చేతివాటం.. బస్పాస్ల్లో అవకతవకలు
TAGGED:
kabaddi_state_secretry