తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్​ వార్నింగ్​..! - REDDY

రైతుల సమస్యలు.... అధికారుల చోద్యాలు... కలెక్టర్​ ఆకస్మిక తనిఖీతో​ బట్టబయలయ్యాయి. అన్నీ ఆలకించిన పాలనాధికారి... అటు బాధితులకు భరోసా, ఇటు అధికారులకు హెచ్చరికలతో అదరగొట్టారు.

అధికారులకు గడువు...రైతులకు భరోసా

By

Published : Feb 28, 2019, 5:14 AM IST

Updated : Feb 28, 2019, 1:25 PM IST

రైతులకు భరోసా..అధికారులకు హెచ్చరిక

జనగామ జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి తరిగొప్పుల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్​ రాకను గమనించిన స్థానికులు తమ సమస్యలు చెప్పుకునేందుకు యత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళనను అధికారులు నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కావాలనే అధికారులు తమ భూములు పట్టాలు చేయట్లేదని కలెక్టర్​కు మొరపెట్టుకున్నారు.

వారంలోపు పూర్తి చేయాలి..!
రైతుల సమస్యలు ఆలకించిన కలెక్టర్ అధికారులను నిలదీశారు. వారం రోజుల్లో మళ్లీ పరిశీలనకు వస్తానని, అప్పటిలోపు పెండింగ్ ఫైల్స్ పూర్తి చేయాలని సూచించారు. రైతులెవరూ నిరాశచెందొద్దని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:కిల్లర్ లేడీ

Last Updated : Feb 28, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details