శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ అన్నారు. జనగామలో నూతనంగా ఏర్పాటు చేసిన 108 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కెమెరాలతో ఉంటే నేరస్థులను పట్టుకోవడం, నేరాల నియంత్రణ సులభతరమవుతుందన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా ఎన్నో కేసులు పరిష్కారమయ్యాయని సీపీ తెలిపారు.
'శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకం'
జనగామలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వరంగల్ సీపీ విశ్వనాథ్ రవీందర్ ప్రారంభించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకం
వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల పరిధిలో 600గ్రామాల్లో 3 వేల కెమెరాలు అమర్చినట్టు వివరించారు. 100కి డయల్ చేస్తే 7 నుంచి 10 నిమిషాల్లో స్పందించేలా డీజీపీ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కువ నిధులు పోలీసు శాఖకు కేటాయించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జమున పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు