తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం' - WOMENS FAMILY WELFARE DEPARTMENT

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనగామ మండలంలోని పలు గ్రామాల నుంచి దాదాపుగా 200 మంది బాల బాలికలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

విద్యార్థులతో స్వయంగా అక్షరాలను దిద్దించిన కలెక్టర్

By

Published : Jun 16, 2019, 10:22 AM IST

జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్​లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో స్వయంగా అక్షరాలను దిద్దించారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాలతోపాటు, పాఠశాలలో అధునాతన సాంకేతిక విద్య అందిస్తున్నామని పాలనాధికారి వినయ్ కృష్ణ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పాఠశాలలో అధునాతన సాంకేతిక విద్య అందిస్తున్నాం : పాలనాధికారి

ABOUT THE AUTHOR

...view details