దుబాయిలో ముందస్తు దీపావళి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. పొయో ఈవెంట్స్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించగా... వేలాది మంది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ కాన్సులేట్ జనరల్ విపుల్ కుమార్, దుబాయ్ పోలీస్ చీఫ్ హాజరయ్యారు. తొలుత మన జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం వేడుకలను ప్రారంభించారు.
దుబాయిలో ముందస్తు దీపావళి వేడుకలు
దుబాయిలో ముందస్తు దీపావళి వేడుకలను పొయో ఈవెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి కళాకారులు నృత్యాలతో అలరించారు.
దుబాయిలో ముందస్తు దీపావళి వేడుకలు
మహిళలకు ముగ్గుల పోటీలు, యువత, పిల్లలకు సాంప్రదాయ ఆటలు నిర్వహించారు. ప్రముఖ హిందీ, కన్నడ, తమిళ్, మలయాళీ సింగర్ విజయ్ ప్రకాష్ బృందం, దేశంలోని 15 రాష్ట్రాల నుంచి కళాకారులు వారి రాష్ట్ర సంస్కృతిని తెలిపే సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. తెలంగాణ నుంచి రిషిత గుప్త ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని చాటే మన బతుకమ్మ నృత్య ప్రదర్శన నిర్వహించారు. చిన్న పెద్ద అంతా ఆనందంతో నృత్యాలు చేశారు.
ఇవీ చూడండి: దీపావళికి స్మార్ట్ఫోన్ కొనాలా..? ఇవైతే చౌక...!