చేపలకు భలే గిరాకీ
మృగశిరకార్తి సందర్భంగా చేపలు కొనేందుకు జనం ఎగబడ్డారు. మార్కెట్లో ఒక్కసారిగా చేపల రెట్లకు రెక్కలొచ్చాయి. అయినా ప్రజలు చేపలు కొంటున్నారు.
చేపలు
మృగశిరకార్తిలో చేపలు తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. భారీ సంఖ్యలో చేపలు కొనేందుకు జనం రావడం వల్ల జగిత్యాల మార్కెట్ కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే మార్కెట్లో సందడి కనిపించింది. డిమాండ్ పెరగటం వల్ల అమ్మకం దారులు చేపల ధరలు పెంచారు. రోజువారి కంటే అదనంగా వసూలు చేశారు. అయినా జనాలు మాత్రం చేపలు కొనుగోలు చేశారు.