జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మంది నిరుపేదలకు కిరాణా సరుకులను అందజేశారు. జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వం అన్ని విధాల పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ - 100 మంది నిరుపేదలకు కిరాణా సరుకులు
జగిత్యాల పట్టణంలో ప్రింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కిరాణా సామగ్రిని పంపిణీ చేశారు.

జగిత్యాలలో నిత్యావసర సరుకుల పంపిణీ