ఆర్టీసీ కార్మికులు నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల పరిధిలో 263 బస్సులుండగా... అందులో 70 అద్దె బస్సులు యథాతథంగా నడుస్తాయని అధికారులు వెల్లడించారు. వీటితో పాటు పాఠశాలలు, టూరిస్ట్ బస్సులను సైతం అందుబాటులో ఉంచామని, అన్ని మార్గాల్లో బస్సులు నడిపి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేశారు.
అన్ని మార్గాల్లో బస్సులు నడుపుతాం: జిల్లా కలెక్టర్
ఆర్టీసీ కార్మికులు నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
అన్ని మార్గాల్లో బస్సులు నడుపుతాం: జిల్లా కలెక్టర్