తెలంగాణ

telangana

ETV Bharat / state

'బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర'

Bandi Sanjay Comments On KCR: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దిల్లీ మద్యం కేసుపై కేసీఆర్‌ ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు. బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Dec 12, 2022, 5:59 PM IST

Updated : Dec 12, 2022, 6:51 PM IST

Bandi Sanjay Comments On KCR: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ సంక్షేమానికి రూ.500 కోట్ల నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. మాట తప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. వారికి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు ఇస్తామన్న హమీ ఏమైందని ప్రశ్నించారు. గల్ఫ్‌ దేశాల నుంచి కార్మికులు రాష్ట్రం కోసం డబ్బులు పంపారని.. ముఖ్యమంత్రి మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే గల్ఫ్‌ దేశాల్లో వేల మంది జైలులో ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణంపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు. పీఎఫ్ఐకి బీఆర్ఎస్‌ పార్టీ నిధులిస్తుందని ఆరోపించారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని విమర్శించారు. పీఎఫ్ఐ జిందాబాద్ అంటూ కొందరు ర్యాలీలు చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. జగిత్యాలలో పాకిస్తాన్‌ జిందాబాద్‌ అన్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లో బాలింతల, శిశువుల మరణాలు బాధాకరమని అన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసే కాంట్రాక్టులు.. కమీషన్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ఏపీ సీఎంతో కలిసి తెలంగాణ, సమైక్యాంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

"టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక రూ.500 కోట్లతో గల్ఫ్ సంక్షేమానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కేసీఆర్ అన్నారు. గల్ఫ్ కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తానని అన్నారు. కనీసం దాని గురించి పట్టించుకోలేదు. వారు అక్కడి నుంచి డబ్బులు రాష్ట్రానికి పంపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు వారిని కేసీఆర్ పట్టించుకోవడం మానేశారు." - బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

'బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర'

ఇవీ చదవండి:'ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి కేసీఆర్ రూ.వేలకోట్లు పంపిస్తున్నారు'

భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల.. రోజుకు లక్ష మంది దర్శనం

Last Updated : Dec 12, 2022, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details