జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలక కార్యాలయం పరిధిలో 26 వార్డులు ఉండగా నాలుగు కోఆప్షన్ పదవులకు అవకాశం ఉంది. దీంతో అధికారులు ఇచ్చిన దరఖాస్తుల చివరి తేది గురువారంతో ముగియడం వల్ల నలుగురు అభ్యర్థులు కో ఆప్షన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులకు అవకాశం ఉన్నందున ఏశాల రాజశేఖర్, పన్నాల మాధవరెడ్డి, గైని లావణ్య, నవీన సుల్తాన్ కలిసి తమ దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌కు అందజేశారు. వారివెంట స్థానిక పురపాలక ఛైర్‌పర్సన్ సుజాత, పాలకవర్గం సభ్యులు ఉన్నారు.
మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం దరఖాస్తులు - metpalli municipality latest news
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలక కార్యాలయంలో కోఆప్షన్ పదవుల కోసం నలుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరు మహిళలకు ఇద్దరు పురుషులకు అవకాశం ఉన్నందున ఏశాల రాజశేఖర్, పన్నాల మాధవరెడ్డి, గైని లావణ్య, నవీన సుల్తాన్ కలిసి తమ దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌కు అందజేశారు.

మున్సిపాలిటీలో కోఆప్షన్ పదవుల కోసం దరఖాస్తులు
వచ్చిన దరఖాస్తులకు మూడు రోజులపాటు పరిశీలిస్తారు. అనంతరం ఈనెల 30న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కౌన్సిల్ సభ్యుల తీర్మానంతో ఈ నలుగురిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు.