తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 5:48 PM IST

Updated : Sep 25, 2023, 6:56 PM IST

ETV Bharat / state

YS Sharmila on YSRTP Merge in Congress : 'కాంగ్రెస్‌లో.. వైఎస్​ఆర్​టీపీ విలీనంపై ఈనెల 30లోపు నిర్ణయం'

YS Sharmila on YSRTP Merge in Congress : కాంగ్రెస్​ పార్టీలో విలీనంపై వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. ఈ నెల 30లోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విలీనం లేకుంటే సొంతంగానే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని షర్మిల పునరుద్ఘాటించారు.

YSRTP
YS Sharmila

YS Sharmila on YSRTP Merge in Congress at Hyderabad : కాంగ్రెస్‌ పార్టీలో విలీనంపై ఈ నెల 30లోపు నిర్ణయం తీసుకుంటామని వైఎస్‌ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఒకవేళ విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో.. షర్మిల (YS Sharmila) అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ముఖ్యనేతలు కార్యకర్తలు హాజరయ్యారు.

Sharmila fires on KCR and KTR : 'మహారాష్ట్రలో తిరుగుతున్న BRS​ నేతల ఖర్చులను తెలంగాణ ఖాతాలో జమచేస్తారా!'

State Level Executive Meeting of YSRTP in Hyderabad : ఈ సమావేశంలో పార్టీ విలీనం, ఎన్నికల వ్యుహంపై ప్రధానంగా చర్చించారు. రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్​టీపీ (YSRTP) పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని షర్మిల పేర్కొన్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ దాడులకు భయపడను: వైఎస్‌ షర్మిల

YS Sharmila Meet With Sonia Gandhi and Rahul Gandhi : ఇటీవలే వైఎస్ షర్మిల.. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో దిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించినట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని వైఎస్ షర్మిల తెలిపారు.

అనంతరం హైదరాబాద్​లో మరోసారి కాంగ్రెస్​లో.. పార్టీ విలీనంపై షర్మిల స్పందించారు. కేసీఆర్ అవినీతి పాలను అంతమెందించేందుకు హస్తం పార్టీతో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో.. సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీతో (Rahul Gandhi) సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు తెలంగాణను కాపాడుకోవాల్సిన ప్రతి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. పార్టీ విలీనంపై చర్చలు తుది దశకొచ్చాయని వెల్లడించారు. తన తండ్రిపై వారికి గౌరవముందని నిర్ధారించుకున్న తర్వాతే సోనియా, రాహుల్​తో చర్చల వరకు వెళ్లినట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు.

వైఎస్‌ఆర్‌పై తమకు అపారమైన గౌరవం ఉందని సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ చెప్పారని వైఎస్‌ షర్మిల తెలిపారు. వైఎస్​ఆర్​ లేనిలోటు ఈరోజుకు కూడా తమకు తెలుస్తోందని వారు అన్నట్లు వివరించారు. దిల్లీలో సోనియా, రాహుల్‌తో చర్చలు సుదీర్ఘంగా, సానుకూలంగా జరిగాయని.. ఆ విషయాలను తర్వాత వెల్లడిస్తానని వివరించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తాను 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

కేసీఆర్ పాల‌న పోతేనే తెలంగాణకు మంచి జరుగుతుందని వైఎస్ షర్మిల అన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలసి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలంటే వండినట్లు.. తిన్నట్లు కాదని అన్నారు. రాజకీయాల్లో ముందుచూపు, ఓపిక, గుండె నిబ్బరం ఉండాలని చెప్పారు. తనతో నడిచిన వారిని తనతో పాటే నిలబెడతానని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.

YS Sharmila Tweet on KCR : కేసీఆర్‌కు షర్మిల సవాల్‌.. దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వండి..

Bhatti Comments on YS Sharmila : 'వైఎస్​ షర్మిల కాంగ్రెస్​లో​ చేరితే ఓకే.. వైఎస్​ కుటుంబమంటే చాలా గౌరవం'

Last Updated : Sep 25, 2023, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details