హైదరాబాద్ మహానగరంలో స్థానికంగా వారపు సంతలుంటే ఎక్కడో దూరంలో ఉండే రైతు బజార్ల వరకు వాహనాలపై వెళ్లి రావాల్సిన అవసరం ఉండదు. పైగా అక్కడ రద్దీగా ఉంటుంది. నిత్యావసరాల్లో ప్రస్తుతం కూరగాయలకే డిమాండ్ అధికం. వీటి ధరలేమో కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య, మధ్యతరగతి వాసులు కాయగూరల ధరలు చూసి హడలిపోతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుత లాక్ డౌన్ కాలంలో కొన్నింటి ధరలు మూడు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయి. సాధారణంగా రూ.10కి ఒక మామిడికాయ అమ్ముతుంటారు. పండగ రోజు రూ.35కు విక్రయించారు. కొనలేక పండగ రోజు ఉగాది పచ్చడిలో పులుపు లేకుండానే కొంతమంది కానిచ్చేశారు. ఇంత ధరలేంటి అని కూరగాయల వ్యాపారులను అడిగితే హోల్‌సేల్ మార్కెట్లోనే మాకు ఎక్కువ ధర పడితే తక్కువ అమ్మేదెలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇష్టారీతిన...
అధిక ధరలపై అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నా.. రైతుబజార్ల వరకే ధరల నియంత్రణ తప్ప మిగతాచోట్ల ఇష్టారీతిగా అమ్ముతున్నారు. ప్రభుత్వం ఇంటింటికి కాకపోయినా కనీసం స్థానిక దుకాణాల వరకు సరకును అందజేయగల్గితే ధరల నియంత్రించవచ్చు. అంతేకాదు ఆయా కాలనీల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు అందుబాటులో ఉంటాయి. పగలు ఎప్పుడైనా వచ్చి కొనుగోలు చేయవచ్చు కాబట్టి జనం ఒక్కసారిగా గుమికూడే అవకాశం ఉండదు. ప్రస్తుతం పాల ప్యాకెట్లను తయారీదారులు దుకాణాల వద్ద ఉదయాన్నే సరఫరా చేస్తోంది. సర్కారే లాక్‌డౌన్ కాలంలో నిత్యావసరాలను స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తే ధరల అదుపు కూడా ఉంటుంది.
వారాంతపు మార్కెట్ల వేళలు మారిస్తే..