నీటి సంరక్షణ, పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో సందర్శించారు రాజేంద్ర సింగ్. తాజాగా తెలంగాణ వచ్చిన ఈ వాటర్ మ్యాన్.. ఎల్బీనగర్ సాగర్ రింగ్రోడ్లోని మద్దెల కుంటను ... అనంతరం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను సందర్శించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాటర్ సెక్యూరిటీ, వాటర్ లిటరసీపై ఒక నివేదికను ఇవ్వనున్నట్లు తెలిపారు. జల సంరక్షణ, వర్షపు నీరు వృధా కాకుండా చూడటం, చిన్న చిన్న కుంటలు, చెరువులు పరిరక్షణ చేసుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే నీటికోసం భవిష్యత్తులో యుద్ధాలు తప్పవని హెచ్చరించారు. జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ, హైదరాబాద్ లేక్స్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భీమ్ ప్రసాద్‌లు.. రాజేంద్ర సింగ్‌తో పాటు ఉన్నారు.
నిర్లక్ష్యం చేస్తే నీటి యుద్ధాలు తప్పవు: రాజేంద్ర సింగ్ - wter man
నీటి సంరక్షణలో భాగంగా ఎల్బీనగర్ సాగర్ రింగ్‌రోడ్ లోని మద్దెల కుంటను సందర్శించారు 'వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ రాజేంద్ర సింగ్. వర్షపు నీరు, చిన్న చిన్న కుంటలు, చెరువులను పరిరక్షించకపోతే భవిష్యత్తులో నీటి కోసం యుద్ధం తప్పదని ఆయన పేర్కొన్నారు.

వర్షపు నీటిని ఆదా చేయండి: డాక్టర్ రాజేంద్రసింగ్
Last Updated : Jul 13, 2019, 4:49 PM IST