హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ఓటుకు నోటు కేసు విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. సెబాస్టియన్, ఉదయ్ సింహలు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ-1 గా ఉన్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి అనిశా న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్... తనకు రక్షణ కల్పించాలని కోర్టును కోరాడు.
ఓటుకు నోటు కేసు ఏప్రిల్ 20కి వాయిదా - VOTUKU NOTU CASE LATEST NEWS
ఓటుకు నోటు కేసు విచారణను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.

ఓటుకు నోటు కేసు ఏప్రిల్ 20కి వాయిదా
గతంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ. 50లక్షలు ఇస్తుండగా... అనిశా అధికారులు రేవంత్‌ను పట్టుకున్నారు. 2015 ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
ఓటుకు నోటు కేసు ఏప్రిల్ 20కి వాయిదా
ఇవీ చూడండి:రాష్ట్రంలో నాలుగుకు చేరిన కరోనా కేసులు
Last Updated : Mar 17, 2020, 2:19 PM IST