తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు మేలు చేసేలా రెవెన్యూ చట్టాలు ఉండాలి'

రెవెన్యూ శాఖలో చట్టాల మార్పునకు తాము పూర్తిగా సహకరిస్తామని... అయితే తమ అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సతీష్​ అన్నారు. ప్రజలకు, రైతులకు మేలు చేసేలా చట్టాలు ఉండాలని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తారో... విలీనం చేస్తారో సర్కారు స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు.

రెవెన్యూ సంఘం అధ్యక్షుడు

By

Published : Aug 28, 2019, 9:37 PM IST

ప్రజలకు, రైతులకు, అధికారులకు మేలు జరిగేలా చట్టాలు తీసుకు రావాలని గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సతీష్ అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని వాసవీ భవన్‌లో జరిగిన తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. శాఖ పేరు మారుస్తాం... రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తామన్నందుకు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళన చేసినప్పుడు రెవెన్యూ శాఖ పనితీరును మెచ్చుకుని బోనస్ ఇచ్చారని గుర్తు చేశారు. ధరణి వెబ్‌సైట్ రైతులకు అధికారులకు మధ్య గొడవలకు దారి తీస్తుందన్నారు. వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలని తాము కోరినట్లు చెప్పారు. తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తారో, విలీనం చేస్తారో సర్కారు స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు.

'ప్రజలకు మేలు చేసేలా రెవెన్యూ చట్టాలు ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details