తెలంగాణ

telangana

ETV Bharat / state

Telugu Akademi FD Scam: 'రూ.2 కోట్లు రికవరీ చేశాం.. ఇంకా రూ.8 కోట్లు రావాలి' - ap news

తెలుగు అకాడమీ నకిలీ ఎఫ్​డీల కేసులో (Telugu Akademi FD Scam) సీసీఎస్ పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారని విజయవాడ సీపీ శ్రీనివాసులు(Vijayawada CP on Fixed Deposit funds fraud case) వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆత్కూరు, భవానీపురం పీఎస్‌లలో కేసులు(police case on FD fraud ) నమోదైనట్లు తెలిపారు. దాదాపు రూ.2 కోట్లు సొమ్ము రికవరీ చేశామని వెల్లడించారు.

Telugu Akademi FD Scam
Telugu Akademi FD Scam

By

Published : Nov 26, 2021, 5:10 PM IST

Telugu Akademi FD Scam: తెలుగు అకాడమీ నకిలీ ఎఫ్​డీల కేసులో కొత్త వ్యక్తులు చాలా మంది బయటపడ్డారని విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు(Vijayawada CP on FD fraud case) తెలిపారు. ఎఫ్‌డీల కేసు హైదరాబాద్‌(Telugu Akademi FD fraud case)లో ప్రారంభమై విజయవాడకు చేరిందని.. ఆత్కూరు, భవానీపురం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. హైదరాబాద్‌ నుంచి 8 మందిని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చామని వివరించారు. దాదాపు రూ.2 కోట్ల సొమ్ము రికవరీ చేశామన్న ఆయన.. రూ.2.57 కోట్ల ఆస్తులను సీజ్ చేసి కోర్టుకు అందజేశామని పేర్కొన్నారు.

'రూ.11.4 కోట్లు కొత్త మోసం చేసేందుకు నకిలీ ఎఫ్‌డీలు తయారు చేశారు. రూ.11.4 కోట్ల ప్రభుత్వ సొమ్ము మోసం జరగకుండా ఆపాం. ఇంకా రూ.8 కోట్ల సొమ్ము రికవరీ కావాల్సి ఉంది. బ్యాంకు సిబ్బంది, మేనేజర్లు మోసాలకు పాల్పడుతున్నారు. రుణాల ముసుగులో డిపాజిట్ల దందా జరుగుతోంది. వచ్చిన సొమ్మును హవాలా కోసం నేరస్థులు వినియోగించారని సమాచారం' - బి.శ్రీనివాసులు విజయవాడ సీపీ

ఇదీ స్కాం...

గుంటూరుకు చెందిన సాంబశివరావు తొలుత ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. జీతం చాలకపోవడం, ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో తన మకాంను కొన్నేళ్ల క్రితం వైజాగ్‌కు మార్చాడు. ఎస్‌వీఎల్‌ యాడ్స్‌ పేరుతో ప్రకటనల కంపెనీని ప్రారంభించాడు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, జాతీయ, కార్పొరేటు బ్యాంకుల ప్రకటనలను సేకరించేవాడు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారాన్ని ముందుండి నడిపిన సాయికుమార్‌ ముఠాలో సభ్యుడైన వెంకటరమణకు..మూడేళ్ల క్రితం వైజాగ్‌లో సాంబశివరావు పరిచయమయ్యాడు. వైజాగ్‌కు వెళ్లినప్పుడల్లా కలుస్తుండడంతో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది.

చెల్లెల్ని ఇరికించి.. తానూ ఇరుక్కుని

కరోనా ప్రభావంతో ప్రకటనల నుంచి వస్తున్న కమీషన్‌ తగ్గిపోవడంతో నిందితుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ సమయం(గతేడాది అక్టోబరు)లో వైజాగ్‌కు వెళ్లిన వెంకటరమణ.. తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్ము(Telugu Academy FD Scam Updates) కాజేసే ఆలోచనను అతనితో పంచుకున్నాడు. తెలిసిన బ్యాంకు మేనేజరు ఉంటే తమ పని సులువు అవుతుందని, కమీషన్‌ కూడా భారీగానే ఇస్తామనే ప్రతిపాదన తెచ్చాడు. ఆర్థిక ఇబ్బందులో ఉన్న సాంబశివరావు దానికి అంగీకరించాడు. తన దగ్గరి బంధువు, చెల్లెలు వరసయ్యే సాధన కెనరా బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తోందని, ఆమె సహాయం తీసుకుందామని ప్రతిపాదించాడు. అందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో సాయికుమార్‌ ముఠా సభ్యులు తమ పథకాన్ని సాధనకు వివరించారు. ఆమె అంగీకరించడంతో కెనరా బ్యాంకులో తెలుగు అకాడమీకి చెందిన రూ.10 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో జమచేశారు. తర్వాత నకిలీ పత్రాలతో ఆ సొమ్ము తీసుకున్నారు. సహకరించినందుకు సాధన రూ.1.99 కోట్లు, సాంబశివరావు రూ.55 లక్షలు కమీషన్‌గా పొందారు.

సంబంధిత కథనాలు:TELUGU AKADEMI FD SCAM: 'కోట్లు కొల్లగొట్టారు.. స్థిరాస్తులు కొనుగోలు చేశారు'

Telugu Akademi FD Scam Updates: తెలుగు అకాడమీ కుంభకోణంపై ఆడిట్‌ శాఖ విచారణ

ABOUT THE AUTHOR

...view details