తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన సమస్యలు పరస్పరం చర్చింకుని పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, అధికారులు, తెలంగాణ నుంచి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, అధికారులు సమీక్షకు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల అధికారులు యథావిధిగా ఎవరి వాదననలను వారు వినిపించారు. తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థలకు సంబంధించి గతంలో చెప్పిన అభిప్రాయాలనే మరోమారు చెప్పారు. సింగరేణి సంస్థ తెలంగాణకే, అనుబంధ సంస్థ ఆప్మెల్ ఆంధ్రప్రదేశ్‌కే చెందుతాయని అటార్నీ జనరల్ న్యాయసలహా ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. న్యాయసలహాను పంపాలని రెండు రాష్ట్రాల అధికారులు కోరారు.
విభజన సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోండి: కేంద్ర హోంశాఖ
విభజన సమస్యలను పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షించారు.
ajay bhalla, central home
పన్నుల వసూళ్లు, పంపకాలకు సంబంధించిన వివాదాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి లెక్కలు తీసుకొని పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. విద్యుత్ బకాయిల వివాదం అంశాన్ని కూడా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. రాష్ట్రానికి కూడా కన్ఫర్డ్ ఐపీఎస్ పోస్టులను కేటాయించేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించినట్లు సమాచారం.
ఇదీ చూడండి:తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: హైకోర్టు