తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC ITI Admissions in Hakimpet : ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు TSRTC గుడ్‌న్యూస్‌.. ఏంటో తెలుసా..?

TSRTC ITI Admissions in Hakimpet : మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డీజిల్‌ విభాగాల్లో ఐటీఐ ప్రవేశాల కోసం టీఎస్ఆర్టీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్‌ శివారు హకీంపేటలో ఆర్టీసీ ఆధ్వర్యంలోని ఐటీఐ కళాశాలకు డీజీటీ అనుమతినిచ్చింది. పదో తరగతి విద్యార్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 8లోగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సంస్థ సూచించింది.

ITI Admissions in Hakimpet
TSRTC

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 7:19 PM IST

TSRTC ITI Admissions in Hakimpet : ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు టీఎస్​ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని సంస్థ నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్హతతో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్​లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

TSRTC AC Electric Buses Launch Today : హైదరాబాద్​లో నేటి నుంచి గ్రీన్ మెట్రో బస్సులు రయ్​రయ్

ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 8వ తేదీలోగా iti.telangana.gov.in వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతోందని తెలిపింది. తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్, హకీంపేటలో ఐటీఐ కళాశాలలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని ఎండీ సజ్జనార్​ తెలిపారు.

Hakimpet TSRTC ITI College : గత విద్యా సంవత్సరం నుంచే వరంగల్ ఐటీఐని.. సంస్థ ప్రారంభించిందని, తాజాగా హాకీంపేట ఐటీఐ కళాశాలకు (Hakimpet TSRTC ITI College) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) అనుమతి ఇచ్చిందని సజ్జనార్ పేర్కొన్నారు. ఆ కళాశాలలో ఈ ఏడాది నుంచి మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్​లలో ప్రవేశాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కొత్త కళాశాలలో నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే సంస్థ తరగతులను నిర్వహిస్తుందని వివరించారు.

TSRTC: చలచల్లగా పర్యావరణహితంగా.. టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్​ ఏసీ బస్సులు

ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు.. కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిప్​ సౌకర్యాన్ని కల్పిస్తామని సజ్జనార్ తెలిపారు. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్​ను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి సమాచారం కోసం 9100664452 ఫోన్ నంబర్​ని సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

టీఎస్ఆర్టీసీ ఎండీగాసజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత.. ఆ సంస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలనే దానిపై ఆయన కృషి చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సంస్థ ఆక్యుపెన్సీ రేటు పెంచడం, రద్దీ ఉండే రూట్లలో బస్సులు ఎక్కువగా పెంచడం వంటివి చేస్తున్నారు.

అందుబాటులోకి TSRTC ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులు.. ప్రైవేట్​ బస్సులకు దీటుగా..!

తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆ​ర్టీసీ తీసుకున్న నిర్ణయం మంచి సత్ఫలితాలను ఇచ్చింది. తద్వారా సంస్థకు కాసుల వర్షం కురిసింది. రాఖీ సందర్భంగాటీఎస్ఆర్టీసీబస్సుల్లో ప్రయాణించిన మహిళలకు లక్కీ డ్రా తీసి బహుమతులు పంపిణీ చేస్తామని ప్రకటించడంతో.. చాలా మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా రూ.22 కోట్ల రాబడి వచ్చింది.

TSRTC Special Buses For Dussehra Festival : దసరా స్పెషల్.. 13వ తేదీ నుంచి 5,265 ప్రత్యేక బస్సులు

TSRTC Gamyam App : ఒక్క క్లిక్​తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details