తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్‌లో చేరిన తెరాస కార్యకర్తలు - Congress party meeting at karmanghat

తెలంగాణలో రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు రేవంత్‌రెడ్డి కోరారు. కర్మన్‌ఘాట్‌లో జరిగిన కార్యక్రమంకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. పలువురు తెరాస కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Members of Congress joined the Congress party at karmanghat hyderabad
కాంగ్రెస్‌లో చేరిన తెరాస కార్యకర్తలు

By

Published : Jan 5, 2020, 12:18 PM IST

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయమే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలు అందుకనుగుణంగా పనిచేయాలని ఎంపీ రేవంత్‌రెడ్డి సూచించారు. కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో పలువురు తెరాస కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి తనను నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీమాజీ ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌లో చేరిన తెరాస కార్యకర్తలు

ఇదీ చూడండి : 'హిందువుల తడాఖా చూపిస్తాం': ఎంపీ బాపురావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details