Traffic Restrictions in Hyderabad Today : నేడు హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలో పలుచోట్లట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్బీ స్డేడియం వైపు వెళ్లే దారుల్లో వాహనాలను అనుమతించమని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
- పబ్లిక్‌గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వెళ్లే వాహనాలు నాంపల్లి వైపు
- ఎస్బీఐ గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు
- బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు
- ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Congress Take Oath in LB Stadium Today : వాహనదారులకు ఏదైనా అసౌకర్యం కలిగితే 910203626 హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన వెంటనే ఒక్కసారిగా అందరూ స్టేడియం నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
'ప్రగతి అంటే ఏమిటో రేవంత్ పాలనలో ప్రజలకు అర్థమవుతుంది'
మరోవైపు రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగారేవంత్రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రజలను భారీ సంఖ్యలో కూడగట్టేలా కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుంచి ప్రజలు సభకు వచ్చేలా ప్లాన్ చేశారు. హస్తం పార్టీ నేతలు మల్లు రవి, మహేశ్ కుమార్ గౌడ్ , అంజన్‌కుమార్, వసంతకుమార్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి సహా పార్టీలోని సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారానికి మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Huge Arrangements at LB Stadium New CM Oath Ceremony : ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు లక్ష మంది ఎల్బీ స్టేడియానికి (LB Stadium) తరలి వస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ రవిగుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. డీజీ సీవీ ఆనంద్, అదనపు డీజీలు శివధర్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.