ఈ-చలానా తప్పించుకునేందుకు వాహనదారులు చేస్తున్న ఆకృత్యాలపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. నెంబర్ ప్లేట్లపై చిన్న అక్షరం లేకపోయినా, కనిపించకపోయినా... హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమర్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పుగా ఉన్న నెంబర్ ప్లేట్లను సరి చేస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి పోలీసులకు మస్కా కొడుతూ జరిమానా తప్పించుకుంటున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.
'ఈ-చలానా తప్పించుకోవాలనుకుంటే... కఠిన చర్యలు' - TRAFFIC
ఈటీవీ భారత్లో వచ్చిన 'ఈ-చలానాను ఇలా తప్పించుకుంటున్నారు' కథనానికి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఇక మీదట ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు.
'ఈ-చలానా తప్పించుకోవాలనుకుంటే... కఠిన చర్యలు'