ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుజీవో 111 ఆంక్షలు ఎత్తివేత హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల క్యాచ్ మెంట్ ప్రాంతంలోని గ్రామాల్లో 111జీఓ ద్వారా విధించిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆంక్షలు ఎత్తివేసిన సర్కార్... జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని షరతు విధించింది.ఆంక్షల ఎత్తివేతతో... ధరలకు రెక్కలే!రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల చిరకాల వాంఛ 26 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ప్రస్తుతం ఆంక్షలు తొలగించడంతో ఇళ్ల నిర్మాణాలు జరిగి భారీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. జీవో 111 ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి సబితారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారన్నారు.మిల్లుల్లో తనిఖీలు చేపట్టండి తెలంగాణలోని రైస్ మిల్లుల్లో ధాన్యం బస్తాలు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా అన్నింటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఎఫ్‌సీఐ అధికారులను ఆదేశిస్తూ లేఖ రాసినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 40 మిల్లుల్లో 18,155 టన్నుల ధాన్యం మాయమైనట్టు వెల్లడైందన్నారు. ఆ ధాన్యం ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తెలంగాణ డబ్బులే ఖర్చు పెడుతున్నారుకేంద్రానికి తెలంగాణ నుంచి పన్నుల ద్వారా వెళ్లిన నిధులే ఎక్కువ అని... రాష్ట్రానికి వచ్చిన నిధులు మాత్రం తక్కువ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో తప్పున్నట్లు భాజపా నేతలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక రోజు పర్యటనలో భాగంగా హనుమకొండ, వరంగల్, నర్శంపేటల్లో 236 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.శ్రీశైలం డ్యాం భద్రతకు ముప్పు! శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని, లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కొత్తగా మరో స్పిల్‌వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి, ఎడమవైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటివి పరిశీలించాలని, మరో స్పిల్‌వే అవసరమని సూచించింది.బస్సు బోల్తా పడి ఇద్దరు మృతిజమ్ముకశ్మీర్లోని ఉద్ధక్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 25 మంది గాయపడ్డారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో రోడ్డు పక్కన ఉన్న వారిపై ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.భాజపా నేత దారుణ హత్య దిల్లీలో భాజపా నేత దారుణ హత్యకు గురయ్యారు. గాజీపుర్ ప్రాంతంలోని అతని నివాసం వద్దే గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.అసాంజే అప్పగింతపై కీలక తీర్పువికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేను అమెరికాకు అప్పగించేలా యూకే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అప్పగింతకు సంబంధించిన తుదినిర్ణయం హోంమంత్రి చేతుల్లో ఉంది. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని, వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదిస్తోంది.బ్యాటింగ్, బౌలింగ్‌లో దిల్లీ భళా IPL 2022: దిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన చేసింది. పంజాబ్ కింగ్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. దిల్లీ బౌలర్లు సమష్టిగా రాణించారు. బ్యాటింగ్‌లో వార్నర్, పృథ్వి షా ధాటిగా ఆడటం వల్ల ఒక వికెట్ నష్టపోయి సునాయాసంగా విజయం సాధించింది.ఆర్జీవీ X నట్టికుమార్'డేంజరస్' (మా ఇష్టం) చిత్రం విషయంలో గత కొన్నిరోజులుగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత నట్టికుమార్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆర్జీవీ.. నట్టి కుమార్‌పై పరువునష్టం దావా వేస్తున్నట్లుగా ప్రకటించి ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆ వెంటనే నట్టి కుమార్ కూడా మరో ప్రెస్‌నోట్ విడుదల చేశారు.