రాష్ట్రంలో అక్కడక్కడా నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. కిందిస్థాయి గాలులు ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని పేర్కొంది.
శ్రీలంక తీరం వద్ద కొనసాగుతున్న అల్పపీడనం..
ఉత్తర శ్రీలంక తీరం దగ్గర అల్పపీడనం కొనసాగుతూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందన్నారు. ఇది రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి వెళ్లి బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనం తెలంగాణా నుండి దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉందని వివరించారు.
ఇదీ చదవండి:ఎనుమాముల మార్కెట్ వద్ద వ్యాపారుల ధర్నా.. నిలిచిన తూకాలు