AP corona cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,601 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 1,597కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి మరో 8 మంది మృతిచెందారు. వైరస్ బారి నుంచి.. కొత్తగా 8,766 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 62,395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
కొవిడ్ వల్ల నిన్న విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 478, కృష్ణాలో 220, గుంటూరులో 144, చిత్తూరులో 123, విజయనగరంలో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Covid Cases in India: భారత్లో కొవిడ్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. తొలిసారి లక్ష దిగువకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జరిపిన 11,56,363 పరీక్షల్లో 83,876 కొత్త కేసులు నమోదయ్యాయి. 895మంది మరణించారు. 1,99,054 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం మరణాలు: 5,02,874
- యాక్టివ్ కేసులు: 11,08,938
- మొత్తం కోలుకున్నవారు: 4,06,60,202