లాక్‌డౌన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న తర్వాత... అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు. గురువారం రాత్రి ఏకాంత సేవ అనంతరం ఈ విషయాన్ని తెలిపారు. కరోనా దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఆగమ సలహామండలి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీవారికి ఆగమోక్తంగా అన్ని సేవలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించే విషయమై లాక్డౌన్ ముగిసిన తరువాత ప్రకటిస్తామన్నారు. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం భక్తుల సమక్షంలో నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహిస్తామన్నారు.
పద్మావతి పరిణయోత్సవం తాత్కాలిక వాయిదా - ఏపీ తిరుమల తాజా వార్తలు
ఏపీలోని తిరుమలలో నిర్వహించే పద్మావతి పరిణయోత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్ వెల్లడించారు. కరోనా దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ... ఉత్సవాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనాల విషయంపై మే 3 తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

పద్మావతి పరిణయోత్సవం తాత్కాలిక వాయిదా