తెలంగాణ

telangana

ETV Bharat / state

Children approach Police For shelter: అయినవాళ్లు గెంటేశారు... పోలీసులను ఆశ్రయించారు - children complaint on their family members in kancharapalem

ఏపీలోని విశాఖ జిల్లా కంచరపాలెంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోవడంతో తమను ఆదరించే వారు ఎవరూ లేరంటూ ముగ్గురు చిన్నారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనతో విస్తుపోయిన పోలీసులు... చైల్డ్ లైన్ సహకారంతో హోమ్​కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Childrens request for help
Childrens request for help

By

Published : Sep 30, 2021, 7:52 PM IST

కుటుంబీకులు పట్టించుకోవడం లేదని ఏపీలోని విశాఖ జిల్లా కంచరపాలెం పోలీసులను ముగ్గురు చిన్నారులు ఆశ్రయించారు. కొన్నేళ్లక్రితం తల్లి చనిపోవడంతో, తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారు అమ్మమ్మ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో చిన్నారులను పోషించడం భారంగా ఉందని... వారి అమ్మమ్మ బయటకు పంపించేసింది. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు కంచరపాలెం పోలీస్ స్టేషన్​కు వచ్చారు.

వీరి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... చైల్డ్ లైన్ సహకారంతో హోమ్​కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే చదువుకుంటామని చిన్నారులు అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చూడండి:Viral Video: శునకం రోడ్డు దాటేందుకు బాలుడి సాయం

ABOUT THE AUTHOR

...view details