హైదరాబాద్ సమీపంలోని అమీన్పూర్ అనాథ ఆశ్రమంలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య ఘటనలపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ స్పందించింది. ఈ నెల 12వ తేదీ పత్రికా కథనాల ఆధారంగా కేసును సుమోటోగా తీసుకోవాలని సూచించింది. ఘటనపై వారం రోజుల్లో పూర్తి వివరాలు పంపాలని 13న హైదరాబాద్ కమిషనర్‌కు ఎన్సీపీసీఆర్ లేఖ రాసింది.
అమీన్పూర్ ఘటనపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఆగ్రహం - హైదరాబాద్ తాజా వార్తలు
అమీన్ పూర్ అనాథాశ్రమంలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య ఘటనపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై పూర్తి వివరాలు అందించాలని హైదరాబాద్ కమిషనర్‌కు లేఖ రాసింది.

అమీన్పూర్ ఘటనపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఆగ్రహం
పోస్టుమార్టం నివేదిక, కేసు దర్యాప్తు నివేదిక సహా పలు వివరాలు సమగ్రంగా అందించాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యులురాలు ప్రజ్జ్ఞా పరాండే లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి :రెడ్‌క్రాస్ వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొనాలి: గవర్నర్