తెలంగాణ

telangana

By

Published : Nov 7, 2020, 10:00 PM IST

ETV Bharat / state

ఆ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రెరాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

The High Court has issued notices to the Central and State Governments on the provisions framed by the Telangana government regarding RERA.
ఆ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం.. రెరాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నిబంధనలను సవాల్ చేస్తూ హైదరాబాద్​కు చెందిన చంద్రశేఖర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల్లో 2017కు ముందు ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చిందని.. దానివల్ల చట్టం ప్రయోజనాలు నెరవేరవని పేర్కొన్నారు. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details