గ్రామపంచాయతీల నుంచి జిల్లా పరిషత్ వరకు ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా మార్చే ఉద్దేశంతో గ్రామానికో కార్యదర్శిని నియమించటంతోపాటు ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 12,751 గ్రామాలకు గాను 9,000 మంది పంచాయతీ కార్యదర్శలను నియమించింది. వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 3,751 పోస్టులను జిల్లా స్థాయిలోనే భర్తీ చేయాలని వికాస్‌రాజ్ సూచించారు.
పంచాయతీరాజ్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
పంచాయతీరాజ్‌లో ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 3వేల 7వందల 51 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
పంచాయతీరాజ్‌లో ఖాళీ పోస్టుల భర్తీ