తమ హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు భారతీయ బౌద్ధ సంఘం మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి వీడి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి... సమ్మె విరమింప చేయాలని బౌద్ధ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య కోరారు. పలు సమస్యలపై చర్చించడానికి సంఘ నేతలు హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు.
ఆర్టీసీ కార్మికులకు బౌద్ధ సంఘం మద్దుతు - భారతీయ బౌద్ధ సంఘం
ఆర్టీసీ కార్మికులకు భారతీయ బౌద్ధ సంఘం మద్దతు తెలిపింది. తమ హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తోన్న కార్మికల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని కోరారు.
ఆర్టీసీ కార్మికులకు బౌద్ధ సంఘం మద్దుతు
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కొత్త జిల్లాల్లో కూడా రెండు పడక గదుల పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి... సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: బస్సుల్లేవ్.. బడికిపోం..!