ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... భాజపా చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చిన కమలం నాయకులు.. గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత - Tension in the obsession of the Hyderabad Collectorate
భాజపా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. భాజపా శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

భాజపా చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత
ట్రాఫిక్ ఇబ్బంది కలగటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. భాజపా శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని.. పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బదిలీలు జరగలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
భాజపా చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత