తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణకు టెండర్లు ఆహ్వనం - తెలంగాణ తాజా వార్తలు

పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. వ్యవసాయ భూములకు సంబంధించి నెలకు దాదాపుగా కొత్తగా 60 వేల పట్టాదారు పాసుపుస్తకాలు ముద్రించాల్సి ఉంటుందని... అందుకు అనుగుణంగా ముద్రణా సంస్థను ఎంపిక చేయనుంది.

passbook tender invitation
tenders invite

By

Published : Apr 13, 2021, 8:18 PM IST

వ్యవసాయ భూముల పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తరపున తెలంగాణ స్టేట్ టెక్నాలజీస్ సర్వీసెస్ - టీఎస్టీఎస్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 17 సురక్షిత ప్రమాణాలకు అనుగుణంగా ఆర్డర్ ఇచ్చిన 14 రోజుల్లోగా పాసుపుస్తకాన్ని ముద్రించి ఇవ్వాల్సి ఉంటుంది.

రెవెన్యూశాఖ నుంచి వివరాలు తీసుకొని పాసుపుస్తకాలు ముద్రించేందుకు వీలుగా ముద్రణాసంస్థ ప్రత్యేకంగా అప్లికేషన్ రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ ద్వారా ఈ నెల 27వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు.

ఇదీ చూడండి:ఔరా..! 1200 ఏళ్లకు ఒకటే క్యాలెండర్​

ABOUT THE AUTHOR

...view details