తెలంగాణ

telangana

By

Published : Apr 30, 2021, 1:38 PM IST

Updated : Apr 30, 2021, 2:07 PM IST

ETV Bharat / state

రాత్రి కర్ఫ్యూ అనంతర చర్యలు వెల్లడించక పోవడంపై హైకోర్టు అసహనం

telangana High Court news, post-night curfew activities in telangana
రాత్రి కర్ఫ్యూ అనంతర చర్యలు వెల్లడించక పోవడంపై హైకోర్టు అసహనం

13:35 April 30

రాత్రి కర్ఫ్యూ అనంతర చర్యలు వెల్లడించక పోవడంపై హైకోర్టు అసహనం

రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ తర్వాత కట్టడి చర్యలు వెల్లడించకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు 45 నిమిషాల్లో వివరాలు తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ప్రభుత్వం చెప్పకపోతే.. తామే ఆదేశాలిస్తామన్న హైకోర్టు .. పాలన విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. 

ఈ రాత్రితో  ఆంక్షలు ముగుస్తున్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని ఉన్నతన్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గత విచారణలో కర్ఫ్యూ నేటితో ముగియనుందని .. తర్వాత ఏం చేయబోతున్నారని ప్రశ్నించిన హైకోర్టు... కేసును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఆఖరి నిమిషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు... కర్ఫ్యూ చర్యలను ప్రభుత్వం ప్రకటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి :పోలింగ్​ కేంద్రం వద్ద తోపులాట.. రంగంలోకి పోలీసులు

Last Updated : Apr 30, 2021, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details