బీబీనగర్ ఎయిమ్స్‌కు (BB NAGAR AIMS) సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (union minister kishan reddy) వాస్తవాలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు (health minister harish rao) ఆరోపించారు. ఎయిమ్స్ విషయమై ఈ ఏడాది అక్టోబర్ తొమ్మిదో తేదీన సీఎస్ సోమేశ్ కుమార్‌కు (cs somesh kumar) కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే, ఆయా శాఖలతో సమన్వయం చేసి వారం రోజుల్లోనే టీఓఆర్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పట్టింపులకు పోకుండా భూమి అప్పగించాలని కిషన్ రెడ్డి అనడం విస్మయం కలిగిస్తోందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పటికే 201 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అప్పగించిందని... ఆ వివరాలను కూడా మీడియాకు విడుదల చేసినట్లు గుర్తు చేశారు.
ఎయిమ్స్ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సార్లు అడిగారు
భవనాల నిర్మాణం వైఎస్ (YS Rajasekhar reddy) హయాంలో పాక్షికంగా జరిగిందన్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 45 కోట్లు ఖర్చు చేసి ఆస్పత్రిని వినియోగం లోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఓపీ, డయాగ్నోస్టిక్ సేవలను (Diagnostic services) ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఎయిమ్స్ కేటాయించాలని కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) పలుమార్లు స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో భవన నిర్మాణాలకు 2,3 ఏళ్ల సమయం పట్టిందని... అయితే రాష్ట్రంలో సిద్ధంగా ఉన్న భవనాలను బదిలీ చేయడంతో ఎయిమ్స్‌లో వెంటనే తరగతులు ప్రారంభమయ్యాయని అన్నారు.
అడిగిన వెంటనే అన్ని అనుమతులు ఇచ్చాం