Telangana Assembly Election Candidates 2023 : అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. 2వేల 297మంది మిగిలారు. అత్యధికంగా అత్యధికంగా సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీలో నిలిచిన గజ్వేల్‌లో 44మంది, కామారెడ్డిలో 39మంది బరిలో ఉన్నారు. కేసీఆర్ పోటీలో నిలిచిన గజ్వేల్‌లో 44మంది, కామారెడ్డిలో 39మంది బరిలో ఉన్నారు. ఉపసంహరణలు పూర్తి కావడంతో స్వతంత్రులకు అధికారులు గుర్తులను కేటాయించారు.
అసెంబ్లీ ఎన్నికలప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసంహరణ గడువు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 297 మంది అభ్యర్థులు మిగిలినట్లు సమాచారం. ఈ నెల 13 న పరిశీలన అనంతరం 2వేల 898 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నంతో ఉపసంహరణల గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 601 మంది అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 297 మంది ఎన్నికల పోటీలో మిగిలారు. సగటున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 19 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పోటీలో మిగిలిన అభ్యర్థుల వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
సీఎం కేసీఆర్పై హైకోర్టులో పిటిషన్ వేసిన బల్మూరి వెంకట్ - కారణమిదే
Candidates Contesting Against CM KCR :ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలో నిలిచిన గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సీఎం పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన కామారెడ్డిలో 39మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 347 మంది అభ్యర్థులు పోటీపడబోతున్నారు.